Rajasthan: అతడి కడుపులో 63 రూపాయి నాణేలు..
Rajasthan: మానసిక వేదన ఉన్న మనిసి ఏం చేస్తాడో అర్థం కాదు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన 36 ఏళ్ల వ్యక్తి తీవ్ర నిరాశలో ఉన్నాడు.;
Rajasthan: మానసిక వేదన ఉన్న మనిసి ఏం చేస్తాడో అర్థం కాదు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన 36 ఏళ్ల వ్యక్తి తీవ్ర నిరాశలో ఉన్నాడు. ఈ క్రమంలోనే అతడు రెండు రోజుల నుంచి కడుపునొప్పితో బాధపడుతున్నాడు.. దీంతో కుటుంబసభ్యులు అతడిని వైద్యుని వద్దకు తీసుకువెళ్లారు. అతడిని పరీక్షించిన వైద్యులు ఎక్సరే తీసారు. కడుపులో రూపాయి నాణేలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో రెండు రోజులు అబ్జర్వేషన్‌లో ఉంచి అతడికి ఆపరేషన్ చేసి కడుపులో ఉన్న నాణేలు బయటకు తీశారు. తీవ్ర మనస్థాపంతో ఉన్న ఆ వ్యక్తి రెండు రోజుల పాటు రూపాయి నాణేలు మింగినట్లు చెప్పారు.
వైద్యులు అతడిని ప్రశ్నించగా 10 -15 నాణేలు మింగినట్లు చెప్పాడు.. కానీ వైద్యులు అతడి కడుపులోనుంచి రూపాయి నాణేలు ఏకంగా 63 ఉన్నాయని వివరించారు. తీవ్ర మనోవేదనతో ఉన్న అతడిని మానసిక వైద్యులకు చూపించమని డాక్టర్లు కుటుంబసభ్యులకు వివరించారు.