Arvind Kejriwal : కేజ్రీవాల్ పై బీజేపీ ఫైర్.. 'మర్యాద లేని సీఎం' అంటూ..!
Arvind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పైన నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.;
Arvind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పైన నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.. ఇవ్వాళా కరోనా నియంత్రణ పైన పీఎం మోదీ బుధవారం మధ్యాహ్నం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
అయితే ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కేజ్రీవాల్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని #MannerlessCM అని ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రధాని మోదీ కీలకమైన విషయాలు చర్చిస్తుంటే కేజ్రీవాల్ చేతులు తలపై పెట్టుకుంటూ, గోక్కుంటూ, నిర్లక్ష్యంగా కూర్చున్నారని, ప్రోటోకాల్ పాటించారా అంటూ నెటిజన్లు నిలదీస్తున్నారు.
అటు ఢిల్లీ సీఎం ప్రవర్తనపైన ఢిల్లీ బీజేపీ కూడా అసహనం వ్యక్త్యం చేసింది.. 'మర్యాద లేని ఢిల్లీ సీఎం' అని ట్వీట్ చేసింది. మోదీ వీడియో కాన్ఫరెన్స్ లో ఢిల్లీ సీఎం ఆరుసార్లు ఆవులించడం గమనార్హం.
Mannerless CM of Delhi! pic.twitter.com/yswnLNI6Ty
— BJP Delhi (@BJP4Delhi) April 27, 2022