Sonu Sood : రాజకీయాల పై కీలక ప్రకటన చేసిన సోనూసూద్..!
Sonu Sood : తన సోదరి మాళవికా సూద్ సచార్ రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా ప్రకటించారు బాలీవుడ్ నటుడు సోనూసూద్.;
Sonu Sood : తన సోదరి మాళవికా సూద్ సచార్ రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా ప్రకటించారు బాలీవుడ్ నటుడు సోనూసూద్. వచ్చే ఏడాది పంజాబ్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీ చేయనున్నట్లుగా ప్రకటించాడు. అయితే ఆమె ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతారనే విషయాన్ని వెల్లడించలేదు. దీనిపైన త్వరలోనే క్లారిటీ ఇస్తామని సోనూసూద్ తెలిపాడు. ప్రజలకి సేవ చేయాలన్న ఆమె నిబద్దత సాటిలేనిదని సోనూ పేర్కొన్నారు. మాళవిక మోగా నియోజకవర్గం నుంచి పోటీ అవకాశం ఉంది. ఇక ప్రస్తుతానికి తాను రాజకీయాల్లోకి రావడం లేదని, సమాజానికి మెరుగైన సేవలందించేందుకు తన సోదరికి అండగా ఉంటానని సోనూసూద్ ప్రకటించారు. సోనూసూద్ ఇటీవల పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీతో సమావేశమై రెండు గంటలకు పైగా చర్చలు జరిపారు.