Professor GN Saibaba: మాజీ ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు

Professor GN Saibaba: ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి అంటూ బాంబే హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మావోయిస్టులతో సంబంధాల కేసులో నిర్దోషి అని తేల్చింది.

Update: 2022-10-14 09:32 GMT

Professor GN Saibaba: ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి అంటూ బాంబే హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 

మావోయిస్టులతో సంబంధాల కేసులో నిర్దోషి అని తేల్చింది.బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ ఈ తీర్పునిచ్చింది. సాయిబాబాను జైలు నుంచి వెంటనే విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. 2017లో ట్రయల్ కోర్టు సాయిబాబాకు జీవిత ఖైదు విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని సెషన్స్ కోర్టు 2017 మార్చిలో సాయిబాబా, ఇతర వ్యక్తులను దోషులుగా నిర్ధారించింది. శారీరక వైకల్యం కారణంగా వీల్‌చైర్‌లో ఉన్న సాయిబాబా ప్రస్తుతం నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉన్నారు.

ఉపా, ఐపీసీలోని వివిధ నిబంధనల ప్రకారం సాయిబాబా, ఇతరులను గతంలో కోర్టు దోషులుగా నిర్ధారించింది. అనంతరం ఈ కేసులో మరో ఐదుగురు దోషుల అప్పీల్‌ను కూడా హైకోర్టు ధర్మాసనం అనుమతించి వారిని నిర్దోషులుగా ప్రకటించింది. ఐదుగురిలో ఒకరు అప్పీలు విచారణలో ఉండగానే మరణించారు. జీవిత ఖైదును సవాలు చేస్తూ ప్రొఫెసర్ సాయిబాబా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన నాగ్‌పూర్‌ బెంచ్‌.. సాయిబాబా నిర్దోషి అని తేల్చింది.

Tags:    

Similar News