టెన్త్, ఇంటర్‌లో టాపర్లకు కార్లు పంపిణీ
జార్ఖండ్‌లో పది, ఇంటర్ పరీక్షల్లో టాపర్లకు విద్యాశాఖ మంత్రి జగర్నాథ్ మహతో కార్లను బహమతిగా ఇచ్చారు.;
జార్ఖండ్‌లో పది, ఇంటర్ పరీక్షల్లో టాపర్లకు విద్యాశాఖ మంత్రి జగర్నాథ్ మహతో కార్లను బహమతిగా ఇచ్చారు. ఈ ఫలితాలు జూలైలో విడుదలైనప్పటికీ బహుమతులు మాత్రం జార్ఖాండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు దివంగత బినోద్ బిహారీ మహాతో జయంతి సందర్భంగా ఈ రోజు బహుమతులు పంపిణీ చేశారు. అయితే, పలితాలు విడుదలైనప్పుడే కార్లు పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు. పదవ తరగతి మాత్రమే చదివిన మంత్రి.. ఇంటర్‌లో అడ్మిషన్ తీసుకొని చేరారు. చదువుకు, వయసుకు సంబంధం లేదని.. ఎప్పుడైనా చదువుకోవచ్చిన జగర్నాథ్ మహతో తెలిపారు. బోర్డు పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన వారికి ఇటీవల ప్రోత్సాహాలు భారీగా అందిస్తున్నారు. ఇలాంటి అవార్డులు విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంచుతాయని ఆయన తెలిపారు