New Guidelines : గ్రామాల్లో కరోనా.. కట్టడికి కేంద్రం కీలక ఆదేశాలు..!

New Guidelines : కరోనా కంటైన్మెంట్, నిర్వహణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.

Update: 2021-05-16 11:23 GMT

New Guidelines : కరోనా కంటైన్మెంట్, నిర్వహణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. గ్రామీణ, పట్టణ, గిరిజన ప్రాంతాల్లో కరోనా బాధితుల సేవలకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని.. గ్రామీణ ప్రజల్లో తీవ్ర అనారోగ్యం, శ్వాస సమస్యలపై నిఘా పెట్టాలంది. ఆశా, ఆరోగ్య కార్యకర్తలతో కరోనా పరిస్థితులు పర్యవేక్షించాలన్న కేంద్రం.. కరోనా లక్షణాలున్న వారికి టెలిమెడిసిలో వైద్య సేవలు అందించాలంది.

కేంద్రం కొత్త మార్గదర్శకాలు..

- గ్రామాల్లో ఆక్సీ మీటర్లు, థర్మామీటర్లు అందుబాటులో ఉంచాలి.

- ఆక్సీ మీటర్ వాడిన ప్రతిసారి శానిటైజ్ చేయాలి.

- ఆశా, అంగన్ వాడీ, వాలంటీర్లతో సేవలు అందించాలి.

- కరోనా బాధితులకు హోం ఐసోలేషన్ కిట్లు అందించాలి.

- కరోనా బాధితుల ఆక్సిజన్ స్థాయిలను నిత్యం పర్యవేక్షించాలి.

- ఆక్సిజన్ స్థాయిలు పడిపోతున్న వారిని ఆస్పత్రులకు తరలించాలి.

- ర్యాపిడ్‌ పరీక్షలపై ఏఎన్‌ఎం, సీహెచ్‌వోలకు శిక్షణ ఇవ్వాలి.

- అన్ని ప్రజారోగ్య కేంద్రాల్లోనూ కొవిడ్‌ పరీక్ష కిట్లు అందుబాటులో ఉంచాలి.

- గ్రామీణ ప్రజల్లో తీవ్ర అనారోగ్యం, శ్వాస సమస్యలపై నిఘా పెట్టాలి.

Tags:    

Similar News