LPG: వాణిజ్య సంస్థలకు ఊరట.. భారీగా తగ్గిన ఎల్‌పీజీ ధర..
వాణిజ్య సంస్థలకు అందించే ఎల్‌పీజీ సిలిండర్ ధరలను భారీగా తగ్గిస్తున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి.;
LPG: వాణిజ్య సంస్థలకు అందించే ఎల్‌పీజీ సిలిండర్ ధరలను భారీగా తగ్గిస్తున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. జూలై 1 శుక్రవారం నుంచి ఈ మారిన ధరలు అమలులోకి వస్తాయని తెలిపింది. తగ్గిన ధరలు వివిధ రాష్ట్రాలలో ఈ విధంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఇండన్ గ్యాస్ సిలిండర్ ధర రూ.198 తగ్గింది. కోల్‌కతాలో ఎల్‌పిజి సిలిండర్ ధర రూ.182, ముంబైలో రూ.190.50, చెన్నైలో రూ.187 తగ్గింది. మరోవైపు డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ల వినియోగదారులు అధిక ధరల భారాన్ని భరిస్తూనే ఉన్నారు.
14.2 కేజీల గ్యాస్ సిలిండర్ రేటు మాత్రం అలాగే ఉంది. వాటి ధరలో ఎలాంటి మార్పు లేదు. మే 19 నాటి ధరలే కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ. 1060 ఉంది. దేశంలోని వివిధ నగరాల్లో, 14.2 కిలోల సిలిండర్ ధర ఈ విధంగా ఉంది..
ఢిల్లీ: రూ. 1,003
ముంబై: రూ. 1,003
కోల్‌కతా: రూ. 1,029
చెన్నై: రూ. 1,019