Gujarath: గుజరాత్ సర్కార్‌పై విమర్శలు.. మేనిఫెస్టో రిలీజ్ చేసిన కాంగ్రెస్..
Gujarath: గుజరాత్‌కు సంబంధించి కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం పేరును తిరిగి సర్దార్ పటేల్ స్టేడియంగా మారుస్తామని ప్రకటించింది.;
Gujarath: గుజరాత్‌కు సంబంధించి కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం పేరును తిరిగి సర్దార్ పటేల్ స్టేడియంగా మారుస్తామని ప్రకటించింది. అధికారంలోకి వస్తే మొదటి కేబినెట్ మీటింగ్‌లోనే మేనిఫేస్టో అమలును ప్రారంభిస్తామని తెలిపింది.
పది లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చింది. వృద్ధులు, ఒంటరి మహిళలు, భర్త చనిపోయిన స్త్రీలకు నెలకు 2 వేల రూపాయల పెన్షన్ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టింది.
రాష్ట్రంలో 3 వేల ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఓపెన్ చేస్తామని తెలిపింది కాంగ్రెస్.బాలికలకు పోస్ట్ గ్రాడ్యూయేషన్ వరకు ఉచిత విద్య అందిస్తామని ప్రకటించింది కాంగ్రెస్. 3 లక్షల వరకు రైతు రుణాల మాఫీ, 3 వందల యూనిట్ల ఉచిత విద్యుత్, 3 వేల నిరుద్యోగ భృతి, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని హామీ ఇచ్చింది. కరోనా పరిహారం కింద 4 లక్షల రూపాయలు అందిస్తామని మేనిఫెస్టోలో పెట్టింది.
ఇదే సమయంలో గుజరాత్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్. గుజరాత్‌లోని బీజేపీ సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గత 27 ఏళ్లలో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తామన్నారు.