Delhi Lockdown : లాక్ డౌన్ ని మరోసారి పొడిగించిన ఢిల్లీ ప్రభుత్వం..!
Delhi Lockdown : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ లాక్ డౌన్ ను మరికొన్ని రోజులు పొడిగిస్తూ ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.;
Delhi Lockdown : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ లాక్ డౌన్ ను మరికొన్ని రోజులు పొడిగిస్తూ ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేపటితో ముగియనున్న లాక్ డౌన్ ను మరో వారం రోజుల పాటు పొడిగిస్తున్నట్లుగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ఈ నెల(MAY) 24 వరకు ఢిల్లీలో లాక్ డౌన్ కొనసాగనుంది.. ఇందుకు ఢిల్లీ ప్రజలు అందరూ సహకరించాలని ఆయన కోరారు.. "ఢిల్లీలో మునుపటితో పోలిస్తే కరోనా కేసులు కాస్త తగ్గాయి.. ఏప్రిల్ మధ్యలో 35 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు... 11.32 శాతానికి పడిపోయింది. అయితే దీనిని 5 శాతం కంటే తగ్గించాల్సిన అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు. లాక్ డౌన్ వల్ల కరోనాను కట్టడి చేయగలుగుతున్నాం. ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇచ్చాయి. " అని ఆయన అన్నారు. కాగా ఢిల్లీలో శనివారం రోజున కొత్తగా 6,430 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.