జనరల్‌ బోగీ ప్రయాణానికి ఇక రిజర్వేషన్‌ అక్కర్లేదు..!

జనరల్ బోగీల్లో ప్రయాణికి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది దక్షిణమధ్య రైల్వే. ఇకపై రిజర్వేషన్ లేని జనరల్‌ రైళ్లలోనూ ప్రయాణించవచ్చు.

Update: 2021-08-24 03:30 GMT

జనరల్ బోగీల్లో ప్రయాణికి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది దక్షిణమధ్య రైల్వే. ఇకపై రిజర్వేషన్ లేని జనరల్‌ రైళ్లలోనూ ప్రయాణించవచ్చు. ఇప్పటి వరకు రిజర్వేషన్‌ ఉంటేనే రైళ్లలోకి అనుమతిస్తున్నారు. కరోనా కాస్త కంట్రోల్‌లోకి రావడంతో సడలింపులు ఇస్తున్న రైల్వే శాఖ.. జనరల్‌ బోగీ ప్రయాణానికి ఇక రిజర్వేషన్‌ అక్కర్లేదని చెప్పింది. అంటే, రైల్వే స్టేషన్లలోని జనరల్‌ బుకింగ్‌ కౌంటర్లలో అన్‌రిజర్వుడ్‌ టికెట్‌ తీసుకుని రైలు ఎక్కొచ్చు. దక్షిణమధ్య రైల్వే జోన్‌ పరిధిలోని 74 రైళ్లలో జనరల్‌ బోగీలను రిజర్వేషన్‌ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ జాబితాలో సికింద్రాబాద్‌ డివిజన్‌లో 29, విజయవాడ డివిజన్‌లో 12, గుంటూరులో 5, గుంతకల్లులో 10, హైదరాబాద్‌లో 6, నాందేడ్‌లో 12 రైళ్లున్నాయి.

Tags:    

Similar News