Election Commission : మరికాసేపట్లో ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్
Election Commission of India : ఐదు రాష్ట్రాల(ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్ మరియు గోవా) ఎన్నికలపై ఎన్నికల సంఘం ఇవాళ క్లారిటీ ఇవ్వనుంది.;
Election Commission of India : ఐదు రాష్ట్రాల(ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్ మరియు గోవా) ఎన్నికలపై ఎన్నికల సంఘం ఇవాళ క్లారిటీ ఇవ్వనుంది. ఈ మధ్యాహ్నం మూడున్నరకు మీడియా సమావేశం నిర్వహించనున్న ఈసీ... ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్నట్లుగా తెలుస్తోంది. గతంలోనే ఈ అంశంపై సమీక్ష నిర్వహించిన ఈసీ.. ఎన్నికలు యథాతథంగా నిర్వహిస్తామని తేల్చిచెప్పారు. అయితే గత వారం రోజులుగా కోవిడ్ కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో ప్రచార ర్యాలీలపై ఆంక్షలు విధిస్తారని తెలుస్తోంది. అదే సమయంలో డిజిటల్ ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని సమాచారం.