సీరం ఇన్‌స్టిట్యూట్‌లో అగ్ని ప్రమాదం.. ఐదుగురు మృతి
పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. నిర్మాణంలో ఉన్న భవంతిలో ప్రమాదం జరిగిందని పుణె మేయర్ మురళీధర్ తెలిపారు.;
పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. నిర్మాణంలో ఉన్న భవంతిలో ప్రమాదం జరిగిందని పుణె మేయర్ మురళీధర్ తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, వెల్డింగ్ వల్లే ఇలా జరిగినట్లు తెలుస్తోందన్నారు. టెర్మినల్ గేట్-1 వద్ద మంటలు చెలరేగగా భవనంలోకి వ్యాపించాయి. మంటలార్పిన తర్వాత ఐదు మృతదేహాలను గుర్తించారు. ప్రస్తుతం NDRF బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.