ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ సేవింగ్ డేస్ సేల్' : 1 రూపాయికే ప్రీ-బుకింగ్ ఐటమ్స్ ..
ఈ-కామర్స్ దిగ్గజ వెబ్‌సైట్లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మరోసారి భారీ డిస్కౌంట్‌తో తమ అమ్మకాలను ప్రారంభిస్తున్నాయి. మీరు గృహోపకరణాలను..;
ఈ-కామర్స్ దిగ్గజ వెబ్‌సైట్లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మరోసారి భారీ డిస్కౌంట్‌తో తమ అమ్మకాలను ప్రారంభిస్తున్నాయి. మీరు గృహోపకరణాలను చౌకగా కొనాలనుకుంటే ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. ఈ వెబ్‌సైట్లలో మీరు ఇతర వస్తువులతో పాటు అన్ని ఎలక్ట్రానిక్స్ వస్తువులను కొనుగోలు చేయవచ్చు. పండుగ సీజన్లో డబ్బు సంపాదించడానికి ఈ-కామర్స్ కంపెనీలు సెప్టెంబరులో భారీగా అమ్మకాన్ని ప్రారంభిస్తున్నాయి. ఫ్యాషన్, గాడ్జెట్లు, గృహ వస్తువులతో సహా అన్ని రకాల వస్తువులపై భారీగా తగ్గింపు ఇస్తున్నాయి.
ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ -
ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ సెప్టెంబర్ 18 నుండి ప్రారంభం కానుంది. ఈ సెల్ సెప్టెంబర్ 20 వరకు నడుస్తుంది. 3 రోజుల పాటు కొనసాగే ఈ సెల్‌కు చాలా తగ్గింపుల తోపాటు గొప్ప ఆఫర్లు కూడా ఇస్తుంది. వినియోగదారులకు మొబైల్, టీవీ, ఉపకరణాలు, టాబ్లెట్లు , ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోలుపై భారీ తగ్గింపు పొందుతారని ఫ్లిప్‌కార్ట్ స్పష్టం చేసింది. అంతేకాదు ఏ వస్తువుపైనైనా 1 రూపాయికె ప్రీ-బుకింగ్‌ను వినియోగదారునికి అందిస్తోంది. ఈ ప్రీ-బుక్ ఆఫర్ సెప్టెంబర్ 15 మరియు 16 సెప్టెంబర్ వరకూ ఉండనుంది. ఎస్బిఐ కార్డు వినియోగదారులకు సెపెరేట్ డిస్కౌంట్ కూడా ఉంటుందని తెలిపింది.
బిగ్ సేవింగ్ డేస్ సమయంలో, టీవీ , గృహోపకరణాలు, మొబైల్ ఫోన్లు , టాబ్లెట్లు, వైర్‌లెస్ మౌస్, కీబోర్డ్, పవర్ బ్యాంక్, కేబుల్, హెడ్‌ఫోన్లు , ఇతర ఉపకరణాలు భారీగా తగ్గింపులో వస్తాయి. ఈసారి బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో 3 కోట్లకు పైగా ఎలక్ట్రానిక్ మరియు ఉపకరణాలు అమ్మకానికి అందుబాటులో ఉంటాయి. మొబైల్ ఫోన్లు, టీవీలు, ఉపకరణాలు టాబ్లెట్ల పై నో కాస్ట్ EMI, కార్డ్‌లెస్ క్రెడిట్ , ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లతో కొనుగోలు చేయవచ్చు.
అమెజాన్ హ్యాపీ సేవింగ్ డేస్ -
అమెజాన్ హ్యాపీ సేవింగ్ డేస్ సేల్ ఈ నెలలో ప్రారంభం కానుంది. అమెజాన్ ఇండియా సెప్టెంబరులో జరగబోయే అమ్మకంలో మెగా డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. హ్యాపీ సేవింగ్ డేస్ సేల్ సెప్టెంబర్ 15 నుండి ప్రారంభమై.. సెప్టెంబర్ 17 వరకు ఉంటుంది. అమెజాన్ కూడా వివిధ ఉత్పత్తులపై భారీ తగ్గింపును ఇస్తుంది. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, గృహోపకరణాలతో సహా ఇతర కేటగిరీ వస్తువులను తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. అదనంగా, కంపెనీ అన్ని వస్తువులకు కూపన్లను వినియోగదారులకు అందిస్తుంది.