Go First Airlines: గో ఫస్ట్ బంపరాఫర్.. రూ.926లకే విమాన ప్రయాణం..
Go First Airlines: గో ఫస్ట్ ఒక ప్రత్యేక విక్రయాన్ని ప్రకటించింది. దీనిలో భాగంగా ఎయిర్‌లైన్ రూ. 926 (అన్నీ కలుపుకొని) నుండి విమాన టిక్కెట్‌లను అందిస్తోంది.;
Go First Airlines: ఒక్కసారైనా ఫ్లైట్ ఎక్కాలన్న కోరిక గో ఫస్ట్‌తో తీర్చేసుకోవచ్చు.. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గో ఫస్ట్ ఒక ప్రత్యేక విక్రయాన్ని ప్రకటించింది. దీనిలో భాగంగా ఎయిర్‌లైన్ రూ. 926 (అన్నీ కలుపుకొని) నుండి విమాన టిక్కెట్‌లను అందిస్తోంది.
రైట్ టు ఫ్లై విక్రయ వివరాలు
గో ఫస్ట్ ఆఫర్ దేశీయ ప్రయాణాలపై మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు ఎటువంటి తగ్గింపు అందించబడదు.
టికెట్ విక్రయాలు 27 జనవరి 2022 లోపు GO FIRSTతో విమాన టికెట్‌ను బుక్ చేసుకోండి" అని ఎయిర్‌లైన్ ట్వీట్‌లో పేర్కొంది.
ఫిబ్రవరి 11 నుంచి మార్చి 31, 2022 మధ్య ప్రయాణించే ప్రయాణీకులకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.
ఈ ఆఫర్ ద్వారా ప్రయాణించే ప్రయాణీకులకు 15 కిలోల వరకు లగేజీ ఛార్జీలు ఉండవు.
కంపెనీ అధికారికి వెబ్‌సైట్‌తో పాటు ఇతర అన్ని ఛానెల్స్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది.