Google Layoff's: మంచి మర్యాదా అన్నదే లేదా...!
20ఏళ్ల పాటూ గూగుల్ కు సేవలు అందించిన ఇంజినీరింగ్ డైరెక్టర్; అర్ధాంతరంగా తీసివేయడంపై మనస్తాపం...;
ప్రపంచవ్యాప్తంగా ఐటీ సంస్థల్లో కొనసాగుతున్న ఉద్యోగాల కోత కొందరికి తీవ్ర వేదనను కలిగిస్తోన్న వైనం చూస్తూనే ఉన్నాం. ఉన్నపళంగా సంస్థ నుంచి వెళ్లిపొమ్మంటే దిక్కుతోచని స్థితిలో కొందరు తీవ్ర మనోవేదను గురౌతున్నారు. అయితే మరి కొందరు సామాజిక మాధ్యమాల్లో తమ గోడు వెళ్లబోసుకుని కాస్త తృప్తిపడుతున్నారు. ఈ కోవలోనే గూగుల్ లో 20ఏళ్ల పాటూ ఇంజినీరింగ్ డైరెక్టర్ గా సేవలు అందించిన గరిమా సహాయ్, తన పట్ల సంస్థ ఎంత కఠోరంగా వ్యవహరించిందీ చెప్పుకొచ్చారు.
ఇటీవలే గూగుల్ ఒకేసారి 12వేల మంది ఉద్యోగులను తీసివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తన జాబ్ కోల్పోయిన గరిమా.. ఒక రోజు సంస్థ అందర్గత ఈమెయిల్ కు యాక్సెస్ కోల్పోయినట్లు వెల్లడించారు. అప్పటికి గానీ, తాను ఉద్యోగం కోల్పోయిన సంగతి తెలియలేదని వాపోయారు. ఈ ప్రక్రియ అంతా ఇంకొంత గౌరవప్రదంగా జరిగి ఉంటే బాగుండేదని విచారం వ్యక్తం చేశారు. ఇక కొత్తగా సంస్థలో చేరే వారందరికీ ఉన్నత విలువలతో కూడిన, దిశానిర్దేశం చేసే నాయకత్వం ఉండదని స్పష్టం చేశారు. అయినప్పటికీ గూగుల్ ఎంతో ప్రత్యేకమైందని వ్యాఖ్యానించారు.
అయితే గూగుల్ లో మాస్ లేఆఫ్ లకు ఎన్నోకారణాలు ఉన్నాయని తెలుస్తోంది. గత రెండేళ్లలో వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా తమ సేవలకు ఎక్కువ డిమాండ్ ఎర్పడటంతో సంస్థ ఎంతోమందిని నియమించింది. అయితే గతేడాది నియామకాలు నిలిపేసింది. అంతేకాదు, సుందర్ పిచయ్ సైతం సంతోషాన్ని డబ్బుతో కొలవద్దని ఉద్యోగులకు పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఉద్యోగాల కోత అనివార్యమని సుందర్ తో పాటూ, సంస్థలోని ఉన్నతాధికారులు సైతం నొక్కి వక్కాణించిన సంగతి తెలిసిందే.