బండారు దత్తాత్రేయకు తృటిలో తప్పిన ప్రమాదం
చికిత్స నిమిత్తం అతడిని హైదరాబాద్‌కు తరలించారు.;
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయకు పెద్ద ప్రమాదం తప్పింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురం వద్ద ఆయన ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి రహదారి పక్కకు దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో కారులో దత్తాత్రేయతో పాటు ఆయన వ్యక్తిగత సహాయకుడు, డ్రైవర్ ఉన్నారు. ఈ ప్రమాదంలో ఆయన సహాయకుడికి స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతడిని హైదరాబాద్‌కు తరలించారు. అనంతరం వేరే వాహనంలో దత్తాత్రేయ సూర్యాపేట వెళ్లారు. విషయం తెలుసుకున్న చౌటుప్పల్ ఏసీపీ సత్తయ్య, ఇన్‌స్పెక్టర్ వెంకన్నలు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.