Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికల నగారా..
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది.;
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. నవంబర్ 12న హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుందని, డిసెంబర్ 8న కౌంటింగ్ నిర్వహిస్తామని ఈసీ ప్రకటించింది. అక్టోబర్ 17న నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపింది.
నామినేషన్లకు చివరి తేదీ అక్టోబర్ 25 కాగా.. అక్టోబర్ 27న నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 29 వరకు గడువు ఉంటుందని ఈసీ స్పష్టంచేసింది. ఒకే విడతలో హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించింది. జనవరి 8తో హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ పదవీకాలం ముగియనుంది. హిమాచల్‌ప్రదేశ్‌లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. మొత్తం 5 లక్షల 7 వేల 261 మంది ఓటర్లు ఉన్నారు.