జీవితంలో ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాలని ట్విట్టర్ లో పోస్ట్ పెట్టిన అరగంటకే..
Deepa Sharma: జీవితం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరు చెప్పలేరు. అందరూ విధి ఆడుతున్న వింత నాటకాల్లో పాత్రధారులే.;
దీప శర్మ Twitter
Deepa Sharma: జీవితం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరు చెప్పలేరు. అందరూ విధి ఆడుతున్న వింత నాటకాల్లో పాత్రధారులే. లైఫ్ అంటేనే ఓ జర్నీ... ఈ ప్రయాణంలో జీవితం మనకి ఇచ్చినవి తీసుకోవాలి. ప్రతీ క్షణం ఎంతో ఆనందంగా ఉండాలి... ఎవరినీ బాధపెట్టకుండా ముందుకు సాగిపోవాలి. అయితే అంతా సవ్వంగా సాగుతున్న వేళ ఇక్కడే కొందరి జీవితాలు ఊహించని మలుపులు తిరుగుతాయి. జైపూర్‌కు చెందిన ఆయుర్వేదిక్ డాక్టర్ దీప శర్మ లైఫ్ ఇలానే టర్న్ అయింది. ఎప్పుడు అందరితో కలిసిమెలిసి ఉండే దీపా అర్థాంతరంగా తనువు చాలించింది. ప్రకృతి అంటే ఎంతో ఇష్టపడే దీప..తన చివరి క్షణాలు.. ప్రాణం పోయేంత వరకు ప్రకృతి ఒడిలోనే గడిపింది.
జైపూర్‌కు చెందిన ఆయుర్వేదిక్ డాక్టర్ దీప శర్మ నేచర్ ఎంజాయ్ చేస్తుంటుంది. ఆయుర్వేద వైద్యురాలిగా మంచి పేరు సంపాదించింది. అయితే ప్రకృతిని అమితంగా ఇష్టపడే దీప సంగాల్ లోయలొని పలు ప్రాంతాలు సందర్శించేందుకు వెళ్లింది. ఇక్కడే దీప జీవితం ముగిసిపోతుందని ఆమె కూడ అనుకొని ఉండరు. ఆహిమాచల్ ప్రదేశ్‌లో సంగాల్ లోయలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో తొమ్మిది మంది మృత్యవాతపడ్డారు.
ఈ దుర్ఘటనలో మరణించిన వారిలో జైపూర్‌కు చెందిన ఆయుర్వేదిక్ డాక్టర్ దీప కూడా ఉన్నారు. మధ్యాహ్నం 12.59 గంటల ప్రాంతంలో అక్కడి కొండల్లో ఉన్న ఇండియా-టిబెట్ బార్డర్ దగ్గర దిగిన ఫొటోను తన ట్విటర్ ఖాతాలో ఆమె షేర్ చేశారు. 1.25 గంటల ప్రాంతంలో కొండచరియలు విరిగి బస్తేరీ వద్ద సంగ్లా-చిట్కుల్ రోడ్డు మీద వెళుతున్న కార్లపై పడ్డాయి. ఓ కారులో ఉన్న దీప అక్కడిక్కడే మృతి చెందింది. జీవితంలో ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాలని ట్విట్టర్ లో పోస్ట్ పెట్టిన అరగంటకే దీప కూడా మృతిచెందింది. దీప పెట్టిన ట్విటర్ పోస్టు వైరల్‌గా మారింది. ఈ ఫోస్ట్ చూసిన నెటిజన్లు దీప మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తు్న్నారు.