రైతుల ర్యాలీ.. హోంశాఖ అత్యవసర భేటీ!

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో రైతులు చేప్టటిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. రైతులు చేస్తున్న ఆందోళనలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Update: 2021-01-26 11:35 GMT

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో రైతులు చేప్టటిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. రైతులు చేస్తున్న ఆందోళనలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతా దళాలు అన్నదాతలను ఎర్రకోట పరిసర ప్రాంతాలనుంచి వెనక్కు పంపుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులపై హోంశాఖ అత్యవసరంగా భేటీ అయింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో సత్వర చర్యలపై చర్చిస్తున్నారు. ఆందోళన జరగుతున్న ప్రాంతాల్లో ఇప్పటికే ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. 25కు పైగా మెట్రో స్టేషన్లను బంద్ చేశారు. మరోవైపు తాజా హింసాత్మక ఘటనలో ఓ రైతు మృతిచెందగా మరికొంతమంది రైతులు గాయపడ్డారు. 

Tags:    

Similar News