Bipin Rawat: బిపిన్ రావత్ దంపతులకు అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్ నివాళులు
Bipin Rawat: మధ్యాహ్నం 2 గంటలకు కామరాజ్ మార్గ్‌లోని రావత్ నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభం అవుతుంది.;
Bipin Rawat: బిపిన్ రావత్ దంపతుల భౌతిక కాయాలకు హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నివాళులు అర్పించారు. సైనిక అధికారులు, ప్రముఖులు రావత్ దంపతుల భౌతిక కాయాల వద్ద పుష్పగుచ్చాలు ఉంచి అంజలి ఘటించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, ఆర్మీ చీఫ్ సవరణె, ఐఏఎఫ్ చీఫ్ చౌదురి శ్రద్ధాంజలి ఘటించారు. మరికాసేపట్లో ఆర్మీ బేస్ ఆస్పత్రి నుంచి బిపిన్ రావత్, మధూలిక భౌతిక కాయాలను కామరాజ్ మార్గ్‌లోని అధికారిక నివాసానికి తరలిస్తారు.
మధ్యాహ్నం 12.30 వరకు ప్రముఖులు, ప్రజలు శ్రద్ధాంజలి ఘటించేందుకు అవకాశం కల్పిస్తారు. రావత్ దంపతులకు సోనియా, రాహుల్, కేంద్ర మంత్రులు, ఎంపీలు, పలు రంగాల ప్రముఖులు నివాళులు అర్పించనున్నారు. 12.30 నుంచి 1.30 వరకు సైనిక దళాల అధికారులు, ముఖ్యుల అంజలి ఘటిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు కామరాజ్ మార్గ్‌లోని రావత్ నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభం అవుతుంది. సాయంత్రం ఐదు గంటలకు కంటోన్మెంట్‌లోని బ్రార్ స్క్వేర్ క్రిమిటోరియంలో అంత్యక్రియలు పూర్తిచేస్తారు.