house construction: మన బడ్జెట్‌‌లో మనకో సొంత ఇల్లు.. ఎలా అంటే..

house construction: చిన్న ఇల్లైనా మనకో సొంత ఇల్లు ఉంటే ఆ ఆనందమే వేరు. వేలకు వేలు అద్దె కడుతూ, సొంత ఇల్లు కట్టుకునే స్థోమత లేక నిరాశతో ఉన్న వారికి కొంత ఊరటనిచ్చే అంశం ఇల్లు కట్టడానికి సంబంధించిన వస్తువుల ధరలు తగ్గడం.

Update: 2022-07-19 07:00 GMT

House Construction: చిన్న ఇల్లైనా మనకో సొంత ఇల్లు ఉంటే ఆ ఆనందమే వేరు. వేలకు వేలు అద్దె కడుతూ, సొంత ఇల్లు కట్టుకునే స్థోమత లేక నిరాశతో ఉన్న వారికి కొంత ఊరటనిచ్చే అంశం ఇల్లు కట్టడానికి సంబంధించిన వస్తువుల ధరలు తగ్గడం. దాంతో రియల్ ఎస్టేట్ నిర్మాణాలు ఊపందుకున్నాయి. వర్షాకాలం కాస్త ఆటంకం ఏర్పడినా ఆషాఢం తర్వాత ఇంటి నిర్మాణాలు ఊపందుకునే అవకాశాలు ఉన్నాయి. పక్కా ప్రణాళికతో మొదలు పెడితే అనుకున్న బడ్జెట్‌లో కొత్త ఇంటి నిర్మాణాలు పూర్తి చేయవచ్చని అంటున్నారు ఇంజనీర్లు.

నిర్మాణ సామాగ్రి ధరలు కొన్ని దిగిరాగా, మరి కొన్నింటి ధరలు భారీగా పెరిగాయి. ఇసుక ధరలు కాలాన్ని బట్టి మారుతున్నాయి. నిర్మాణ కూలీల ధరలు సైతం పెరిగాయి. మొత్తంగా చూస్తే చదరపు అడుగుకు రూ.1800 వరకు వ్యయం అవుతుందని నిర్మాణదారులు అంటున్నారు. మార్కెట్లో నిర్మాణ సామాగ్రి ధరల హెచ్చుతగ్గులను బట్టి ఇది కొంత తగ్గవచ్చు లేదంటే పెరగవచ్చు అని చెబుతున్నారు నిర్మాణదారులు. ప్రస్తుతం స్టీల్ టన్ను ధర రూ.65 వేల నుంచి రూ.68 వేల వరకు ఉంది. సిమెంట్ బస్తా రూ.350 నుంచి రూ.400 వరకు వెళ్లింది. ఇల్లు కట్టుకునే వారు ఎక్కడ వృధా అవుతుందో చూసుకుని అక్కడ కట్టడి చేస్తే చాలా వరకు ఖర్చు తగ్గించుకోవచ్చని అంటున్నారు ఇంజనీర్లు.

అనుభవం కలిగిన ఇంజనీర్లను పెట్టుకుని ఇల్లు కట్టుకోవడం మొదలు పెట్టాలి. వీరికి ఫీజు రూపంలో పెద్ద మొత్తంలో చెల్లించాల్సి వస్తుందని సొంత ప్రయోగాలు చేస్తుంటారు.. లేదంటే మేస్త్రి మీద ఆధారపడుతుంటారు.. అయితే దాని వలన ప్లాన్ పక్కాగా లేకపోగా వృధా ఖర్చుకు దారి తీస్తుంది. ఇంజనీర్లను సంప్రదిస్తే.. అన్నీ వివరంగా చెబుతారు.. ప్లాన్‌కు అనుగుణంగా చేపడితే బడ్జెట్‌లోనే నిర్మాణాన్ని పూర్తి చేయవచ్చు.

వాస్తు సరిగా లేదని, లేదంటే గోడ అడ్డుగా ఉందనో, మరొకటో చెప్పి కట్టిన వాటిని పగలగొట్టడం చేస్తుంటారు.. దీని వల్ల గోడలు క్రాక్ రావడంతో పాటు ఖర్చు కూడా అదనంగా పెరుగుతుంది. అందుకే ముందే కుటుంబసభ్యులు, వాస్తు నిపుణులను సంప్రదించే ఒక నిర్ణయానికి రావాలి. కట్టిన అనంతరం ఎలాంటి మార్పులు జరగకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇంజనీర్లు కూడా వాస్తును పరిగణనలోకి తీసుకునే ప్లాన్లు ఇస్తున్నారు. కాబట్టి మీ బడ్జెట్లోనే ఇంటి నిర్మాణం పూర్తవుతుంది జాగ్రత్తగా వ్యవహరిస్తే.

Tags:    

Similar News