కోటీశ్వరులైన 'పేదవాళ్లు'.. ఐటీ శాఖ దర్యాప్తులో దిమ్మతిరిగే విషయాలు..!
ఒకరు ఛాయ్ అమ్మకుంటూ,మరొకరు పండ్లు అమ్ముకుంటూ బతుకు బండి లాగిస్తున్నారు..;
ఒకరు ఛాయ్ అమ్మకుంటూ,మరొకరు పండ్లు అమ్ముకుంటూ బతుకు బండి లాగిస్తున్నారు.. అయితే ఇదంతా చూడడానికే, బయటకు కనిపించిదే.. వీరి ఆదాయం లక్షల్లో, ఇంకొందరిది అయితే కోట్లల్లో.. నమ్మడానికి కొంచం కష్టంగా ఉన్నప్పటికీ ఇది నిజమే.. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో పేదలుగా పరిగణిస్తున్న చిరువ్యాపారులపై ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తు జరపగా దిమ్మతిరిగే విషయాలు బయటకు వచ్చాయి. వారి దర్యాప్తులో అక్కడ 250 మందికి పైగా చిరువ్యాపారుల కోటీశ్వరులేనని తేలింది. వీరంతా ఆదాయపు పన్నులు చెల్లించడం లేదు సరికదా.. జీఎస్‌టీ పరిధిలో లేకపోవడం గమనార్హం.
ఈ 256 మంది చిరు వ్యాపారులు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించలేదని అధికారులు గుర్తించారు. కమర్షియల్ ప్రాంతాల్లోనే వీరికి భూములున్నాయని అధికారులు గుర్తించారు. కరోనా లాంటి విపత్కరమైన సమయంలో దేశం అతలాకుతలం అయిన సమయంలో ఈ చిరువ్యాపరులు కోట్లు పెట్టి లాండ్స్ కొన్నట్టుగా వారి దర్యాప్తులో తేలింది. ప్రభుత్వం కన్నుకప్పడానికి కొందరు చిరువ్యాపారులు మరికొందరు తమ బంధువుల పేర్లతో ఆస్తులు కొనుగోలు చేస్తున్నారని ఐటీ శాఖ దర్యాప్తులో తేలింది. వీరి పాన్ కార్డులు, ఆధార్ కార్డులను చెక్ చేయగా అసలు కథ బయటపడింది.