Bipin Rawat: భరత భూమి కన్నీరు.. వీరుడికి ఘన నివాళి
Bipin Rawat: పలుపార్టీల ఎంపీలు, నేతలు, సైనిక అధికారులు.. రావత్ దంపతుల భౌతిక కాయాల వద్ద పుష్పగుచ్చాలు ఉంచి అంజలి ఘటించారు.;
Bipin Rawat: భరత భూమి కన్నీరుపెట్టింది. ఓ వీరుడా నీకు వందనం అంటూ నివాళులర్పించింది. 42ఏళ్ల సుదీర్ఘజీవితాన్ని సైన్యానికి అంకితం చేసిన బిపిన్ రావత్, ఆయన సహధర్మచారిని మధులిక రావత్ దంపతులకు.. ప్రముఖులు, అతిరథమహారుధులు కన్నీటి నిరాజనాలు పలికారు. భారతప్త హృదయంతో నివాళులర్పించారు.
బిపిన్ రావత్ దంపతుల భౌతిక కాయాలకు హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ నివాళులర్పించారు. రాజ్యసభ విపక్షనేత మల్లిఖార్జున ఖర్గే, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డీఎంకే నేత కనిమొళి సహా పలుపార్టీల ఎంపీలు, నేతలు, సైనిక అధికారులు.. రావత్ దంపతుల భౌతిక కాయాల వద్ద పుష్పగుచ్చాలు ఉంచి అంజలి ఘటించారు.
జాతీయ భద్రతా సలహాదారుల అజిత్ ధోవల్, ఆర్మీ చీఫ్ సవరణె, ఐఏఎఫ్ చీఫ్ చౌదురి శ్రద్ధాంజలి ఘటించారు. ప్రముఖుల నివాళుల అనంతరం.. మధ్యాహ్నం 12గంటల 30 నిమిషాల నుంచి సైనిక సిబ్బంది నివాళులు అర్పించనున్నారు.
అనంతరం మధ్యాహ్నం 2గంటల నుంచి కామరాజ్ మార్గ్‌లోని రావత్ నివాసం నుంచి బ్రార్ స్క్వేర్ శ్మసాన వాటిక వరకు అంతిమయాత్ర సాగనుంది. సాయంత్రం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి.