Indigo Flight: 'నోరు మూసుకో... నేను మీ సేవకుడిని కాదు': ప్యాసింజర్‌పై ఎయిర్ హోస్టెస్ ఫైర్
Indigo Flight: కో అంటే కోటి.. దొర్లుకుంటు వస్తుంది కొండ మీది కోతి అని క్షణం క్షణంలో ఓ పాటుంది. అంటే డబ్బుంటే ఏదైనా సాధ్యమనే కదా అర్థం.;
Indigo-Flight: కో అంటే కోటి.. దొర్లుకుంటు వస్తుంది కొండ మీది కోతి అని క్షణం క్షణంలో ఓ పాటుంది. అంటే డబ్బుంటే ఏదైనా సాధ్యమనే కదా అర్థం. అవును నిజమే. కానీ కాస్త సంస్కారం కూడా ఉండాలి. మన దగ్గర డబ్బుంటే లగ్జరీ సీట్ బుక్ చేసుకుని ప్రయాణించొచ్చు. కానీ అందులోని ఎంప్లాయిస్ అందర్నీ ఒకే మాదిరిగా ట్రీట్ చేయాలనుకుంటారు. వారి సేవలు కస్టమర్ల కోసం వినియోగిస్తారు. చాలా ఓపికతో చేయాల్సిన ఉద్యోగం. అందరూ ఒకేలా ఉండరు కదా. కస్టమర్ ఆర్డర్ చేసిన ఫుడ్ అందివ్వలేకపోయింది ఎయిర్ హోస్టెస్. దాంతో ఇద్దరి మధ్యా వాగ్వాదం చోటు చేసుకుంది. నోర్మూసుకో అనేంత వరకు వెళ్లింది వీరి గొడవ.
ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో ప్రయాణీకుడికి, ఎయిర్ హోస్టెస్‌కు మధ్య ఆహారం విషయంలో గొడవ జరిగింది. ఇస్తాంబుల్-దిల్లీ విమానంలో ఈనెల 16న ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రయాణీకుడు దీనిని చిత్రీకరించి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.
ఎయిర్ హోస్టెస్ ఆ వ్యక్తితో మాట్లాడుతూ మీ వల్ల మా ఉద్యోగి ఏడుస్తున్నారు. మీ బోర్డింగ్ పాస్‌లో ఏం ఉందో దాని ప్రకారమే మేము ఆహారాన్ని అందిస్తాం అని చెప్పింది. దానికి ప్రయాణీకుడు స్పందిస్తూ.. నువ్వు ప్రయాణికుడికి సేవకురాలివి అని వ్యాఖ్యానించారు.
దీనిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నేను ఉద్యోగిని.. నీకు పనిమనిషిని కాను అని గట్టిగా అరిచింది. దీంతో ఎందుకు అరుస్తున్నావు.. నోర్మూసుకో అని ప్రయాణీకుడు హెచ్చరించగా ఎయిర్ హోస్టెస్‌కి కోపం నషాళానికి ఎక్కింది. నువ్వే నోర్మూసుకో అని బదులిచ్చింది. ఆమె సహోద్యోగి వారిద్దరిని వారించడంతో గొడవ సద్దుమణిగింది.