Karnataka: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు.. తొలి జాబితా విడుదల

Karnataka: త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది.;

Update: 2023-03-25 09:11 GMT

Karnataka: త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఈ రోజు కాంగ్రెస్ 124 మంది అభ్యర్ధులతో కూడిన తొలి జాబితాను ప్రకటించింది. మాజీ సీఎం సిద్ధరామయ్య వరుణ నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ డికె శివకుమార్ కనకపుర అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికలలో పోటీ చేస్తారు. కొరటగెరె (ఎస్సీ) నియోజకవర్గం నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి జి పరమేశ్వరను పార్టీ బరిలోకి దింపింది. మాజీ మంత్రులు కేహెచ్ మునియప్ప, ప్రియాంక్ ఖర్గే వరుసగా దేవనహళ్లి, చితాపూర్ (ఎస్సీ) నుంచి పోటీ చేయనున్నారు. ప్రియాంక్ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కుమారుడు. కర్ణాటక ఎన్నికలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన తొలి పార్టీ కాంగ్రెస్. దక్షిణాది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం ముగిసే సమయానికి మే నెలలోపు కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దక్షిణాదిలో బీజేపీ నుంచి అధికారాన్ని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.

Tags:    

Similar News