Narendra Modi : వారణాసిలో రేపు ప్రధాని మోదీ పర్యటన
ప్రధానమంత్రి మోదీ సోమవారం తన పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో పర్యటించబోతున్నారు. తన కలల ప్రాజెక్టు కాశీ విశ్వనాథ్ కారిడర్ ను ప్రారంభించనున్నారు.;
Narendra Modi : ప్రధానమంత్రి మోదీ సోమవారం తన పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో పర్యటించబోతున్నారు. తన కలల ప్రాజెక్టు కాశీ విశ్వనాథ్ కారిడర్ ను ప్రారంభించనున్నారు. గంగానదిపై ఉన్న రెండు ఘాట్ లతో పురాతన కాశీ విశ్వనాథ ఆలయాన్ని ఈ కారిడర్ కలపనుంది. 5వేల హెక్టార్ల స్థలంలో దీన్ని నిర్మించింది యూపీ ప్రభుత్వం. ఇందుకోసం 399 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. కొత్త కారిడర్ కాశీ గౌరవాన్ని మరింత పెంచుతుందని ఆలయ అధికారులు తెలిపారు. పర్యాటకరంగ వృద్ధికి ఇది దోహదం చేస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.