Kedarnath Temple: తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయం..

ప్రసిద్ధ చార్ ధామ్ మందిరాల్లో ఒకటైన కేదార్‌నాథ్ ఆలయం సోమవారం తెరుచుకుంది.

Update: 2021-05-17 11:25 GMT

Kedarnath Temple: ప్రసిద్ధ చార్ ధామ్ మందిరాల్లో ఒకటైన కేదార్‌నాథ్ ఆలయం సోమవారం తెరుచుకుంది. కఠినమైన కోవిడ్ ప్రోటోకాల్‌ల మధ్య కేదార్‌నాథ్ ఆలయ తలుపులు తెల్లవారుజామున తిరిగి తెరిచినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

"ఈ రోజు ఉదయం 5 గంటలకు అన్ని ఆచారాలతో కేదార్‌నాథ్ మందిరం తిరిగి ప్రారంభించబడింది. అందరూ ఆరోగ్యంగా ఉండాలని బాబా కేదార్‌నాథ్‌ను ప్రార్థిస్తున్నాను" అని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ ట్వీట్ చేశారు.

ఈ రోజు కార్యక్రమానికి ఎంపికైన కొద్దిమంది పూజారులు, పరిపాలనా అధికారులు మాత్రమే హాజరయ్యారు. మరో రెండు చార్ ధామ్ పుణ్యక్షేత్రాల ద్వారాలు గంగోత్రి, యమునోత్రి మే 14 న తిరిగి ప్రారంభించబడ్డాయి. కేదార్‌నాథ్ ఆలయం పరమ శివుడి పుణ్య క్షేత్రం.

కరోనావైరస్ మహమ్మారి యొక్క భయంకరమైన సెకండ్ వేవ్ ని దృష్టిలో ఉంచుకుని ఉత్తరాఖండ్ ప్రభుత్వం చార్ థామ్ యాత్ర తీర్థయాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కోవిడ్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని, చార్ థామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.

ఆలయ ద్వారాలు తెరిచి ప్రతి రోజు పూజాదికాలు మాత్రమే నిర్వహిస్తారు అర్చకులు. యాత్రికులను అనుమతించరు అని ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

ప్రధాని నరేంద్ర మోడీ తరఫున మొదటి పూజలు జరిగాయని పూజారి తెలిపారు. బద్రీనాథ్ ఆలయం మే 18 న తిరిగి తెరవబడుతుంది.

Tags:    

Similar News