KK Shailaja : విజయన్ క్యాబినెట్ లో శైలజకి దక్కని చోటు..!
KK Shailaja : కేరళలో కరోనా కట్టడికి అవిశ్రాంతంగా పనిచేసిన ఆరోగ్యశాఖమంత్రి కేకే శైలజకి మే 20న కొత్తగా కొలువుదీరే క్యాబినెట్ లో చోటు దక్కలేదని తెలుస్తోంది.;
KK Shailaja : కేరళలో కరోనా కట్టడికి అవిశ్రాంతంగా పనిచేసిన ఆరోగ్యశాఖమంత్రి కేకే శైలజకి మే 20న కొత్తగా కొలువుదీరే క్యాబినెట్ లో చోటు దక్కలేదని తెలుస్తోంది. ఆమెకి మంత్రి పదవి కాకుండా ప్రభుత్వ విప్ గా నియమిస్తారని తెలుస్తోంది. తొలుత జాబితాలో ఆమె పెరున్నప్పటికి.. ఆ తర్వాత చేసిన మార్పుల్లో చోటు దక్కలేదని సమాచారం. కరోనానే కాకుండా నిఫా వైరస్ ని సైతం ఆమె ఆరోగ్య శాఖ మంత్రిగా ఎంతో సమర్ధవంతంగా ఎదురుకున్నారు. కాగా ఎల్డీఎఫ్ కేబినెట్‌లో సీపీఎం నుంచి 12 మంది, సీపీఐ నుంచి నలుగురు, కేరళ కాంగ్రెస్ (ఎం), జనతాదళ్ (ఎస్), ఎన్సీపీ తరఫున ఒక్కొక్కరు ఉండనున్నారు. స్పీకర్ పదవి సీపీఐ (ఎం) చేపట్టనుండగా.. డిప్యూటీ స్పీకర్ పదవిని సీపీఐ, చీఫ్ విప్ పదవిని కేరళ కాంగ్రెస్ (ఎం) చేపట్టనున్నారు.