Ladakh: పట్టు కోల్పోతున్న భారత్...!

65 పెట్రోలింగ్ పాయింట్లలో 25పై పట్టుకోల్పోయిన భారత్: నివేదిక

Update: 2023-01-25 09:56 GMT

ఇండో-చైనా సరిహద్దు పై భారత్ క్రమంగా పట్టుకోల్పోతోందని లేహ్ ఎస్పీ పీడీ నిత్య వెల్లడించారు. లఢాఖ్ లో 3500కి.మి పొడవున్న సరిహద్దు వెంబడి ఏర్పాటైన  65 పెట్లోలింగ్ పాయింట్లలో 25 పాయింట్లపై భారత్ తన పట్టు కోల్పోయిందని ఆమె తెలిపారు. 


కరాకోరమ్ పాస్ నుంచి చుముర్ వరకూ ఏర్పాటైన పెట్రోలింగ్ పాయింట్లను భారత భద్రతా దళాలు నిత్యం గస్తీ కాస్తుండగా... 5-17, 24-32, 37 పాయింట్లపై పూర్తిగా నిఘా కోల్పోయామని నిత్య స్పష్టం చేశారు.


ఇటీవలే ఢిల్లీలో జరిగిన జాతీయ సీనియర్ పోలీస్ ఆఫీసర్ల సమావేశానికి ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ విచ్చేసిన సందర్భంగా ఈ నివేదికను సమర్పించారు.


భారత భద్రతా దళాల నిఘాతో పాటూ, జన సంచారం లేని కారణంగా ఆ ప్రాంతాల్లోకి క్రమంగా చైనీయులు చొచ్చుకువస్తారని, తదర్వా దేశ సరిహద్దును మరింత లోపలికి తీసుకువచ్చే ప్రయత్నా లు జరుగుతున్నాయిని నివేదిక చెబుతోంది. ఆ ప్రాంతాల్లో బఫర్ జోన్ ఏర్పడి తద్వారా దానిపై భారత్ కు పట్టు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. ఇదే విధంగా ఒక్కో అంగుళాన్ని తమ దేశంలో కలిపేసుకునే పద్ధతికి చైనా ప్రభుత్వం సలామీ స్లైసింగ్ అని నామకరణం చేసిందని నివేది స్పష్టం చేస్తోంది. 


మరోవైపు ఏఆఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ దేశంలో అత్యంత అసమర్థమైన ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించారని ఎద్దేవా చేశారు. చైనాకు భారత్ భూభాగాన్ని కట్టబెడుతున్నారని వ్యాఖ్యానించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సైతం చైనా ఆగడాలకు హద్దులేకుండా పోతున్న తరుణంలో మోదీ శత్రుదేశంతో ద్వైపాక్షిక సంబంధాలు నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబెట్టారు. 


 


Tags:    

Similar News