ఆవుపేడలో పుట్టి పెరిగా.. నాకెందుకొస్తుంది కరోనా: మంత్రి
నేను ఆవుపేడలో, బురదలో పుట్టి పెరిగా. వాటిల్లో చాలా క్రిమి కీటకాలు ఉంటాయి. అప్పుడూ ఏం కాలేదు.. ఇప్పుడూ కూడా ఏమీ కాదు..;
మట్టిలో పుట్టి మట్టిలో పెరిగినోళ్లం మాకెందుకు వస్తుంది కరోనా అని ఇప్పటికే కొంత మంది మంత్రులు సెలవిచ్చారు.. అయినా కరోనా వారిని కూడా పలకరించిన సంఘటనలు ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా మధ్య ప్రదేశ్ మంత్రి ఇమార్తి దేవి తనకి కరోనా వచ్చిందని వస్తున్న వార్తలను ఖండించారు.. ఇలాంటి తప్పుడు వార్తలు రాయకండి.. అయినా నాకెందుకు వస్తుంది కరోనా.. నేను ఆవుపేడలో, బురదలో పుట్టి పెరిగా. వాటిల్లో చాలా క్రిమి కీటకాలు ఉంటాయి. అప్పుడూ ఏం కాలేదు.. ఇప్పుడూ కూడా ఏమీ కాదు.. కరోనా నా దరికి చేరదు అని ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
मैं गोबर में पैदा हुई हूं इतने कर्रे कीटाणु है कि #कोरोना नहीं आएगा - #मंत्री_इमरती_देवी
— Kumar kundan ostwal (@OstwalKumarp) September 4, 2020
ठीक है मान ली आपकी बात 🙏 #imartidevi #MadhyaPradesh #ShivrajSinghChauhan pic.twitter.com/AaK3ZcJ4pr