ఉచిత పధకాలతో ప్రజలను సోమరిపోతులను చేస్తున్నారు : మద్రాస్ హైకోర్టు

తమిళనాడు ఎన్నికల్లో పార్టీలు ప్రకటిస్తున్న ఉచిత హామీల పైన మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Update: 2021-04-01 02:45 GMT

తమిళనాడు ఎన్నికల్లో పార్టీలు ప్రకటిస్తున్న ఉచిత హామీల పైన మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచిత పధకాల ద్వారా ప్రజలను మరింత సోమరిపోతులుగా మారుస్తున్నరంటూ అసహనం వ్యక్తం చేసింది. ఇలా చేయడం కన్నా.. ఉద్యోగాల సృష్టి, ఆరోగ్యం, రవాణా, మౌలిక సదుపాయాల కల్పన పై రాజకీయ పార్టీల ద్రుష్టి పెట్టాలని సూచించింది. ఉచిత పధకాల వల్ల ఏ పని చేయకపోయినా , ఎలాగైనా బ్రతికేయచ్చు అని ప్రజలు భావిస్తున్నారని కోర్టు అభిప్రాయపడింది. ఇక అధికారంలోకి వచ్చేందుకు ప్రకటించిన హామీలను నెరవేర్చని పార్టీల గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.  

Tags:    

Similar News