Maharastra: ఘోర ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న బస్సు.. 11 మంది మృతి
Maharastra: మహారాష్ట్రలోని నాసిక్‌లో గత రాత్రి బస్సులో మంటలు చెలరేగడంతో కనీసం పదకొండు మంది మరణించారు. పలువురు గాయపడ్డారు.;
Maharastra: మహారాష్ట్రలోని నాసిక్‌లో గత రాత్రి బస్సులో మంటలు చెలరేగడంతో కనీసం పదకొండు మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. నాసిక్‌లోని ఔరంగాబాద్ రోడ్డులో తెల్లవారుజామున 5.15 గంటల ప్రాంతంలో ట్రక్కును ఢీకొనడంతో బస్సులో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకున్న పలువురు ప్రయాణికుల హాహాకారాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది.
ఈ సంఘటన నా ఇంటి దగ్గర జరిగింది. ఇక్కడ భారీ వాహనాలు తిరుగుతుంటాయి. ఈ ఘటన తర్వాత బస్సులో మంటలు చెలరేగి ప్రజలు సజీవదహనమయ్యారు. చూస్తున్నాం కానీ ఏమీ చేయలేకపోయాం.
సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ, పోలీసులు వచ్చి మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు అని ప్రత్యక్ష సాక్షి ఒకరు జాతీయ మీడియాకు వివరించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రకటించారు.
క్షతగాత్రుల వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని రాష్ట్ర మంత్రి దాదా భూసే తెలిపారు. నాసిక్‌లో బస్సు అగ్నిప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు పిఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుండి 2 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియాను అందిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50వేలు అందజేయనున్నారు.