Maharastra:m మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం
రాయ్‌ఘడ్ జిల్లాలో లోయలో పడిపోయిన బస్సు; 13 మంది దుర్మరణం.. మరో 25 మందికి గాయాలు;
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయ్‌ఘడ్ జిల్లాలో ఒక బస్సు లోయలో పడిపోవడంతో... 13 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 25 మంది గాయపడ్డారు. పుణె, రాయ్‌గడ్ జిల్లాల సరిహద్దులో ఈ ప్రమాదం జరిగినట్లు జిల్లా ఎస్పీ సోమ్‌నాథ్ గార్గ్ తెలిపారు. పింపుల్ గౌరవ్ నుంచి గోరేగావ్‌కు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటన జరిగినపుడు బస్సులో 41 మంది ప్రయాణిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.