Mamata Banerjee : ఒంటరిగానే పోటీ
ఎవరైతే బీజేపీని ఓడించాలను కుంటారో వాళ్లంతా తృణమూల్‌కే ఓటు వేస్తారన్నారు. సీపీఎం, కాంగ్రెస్‌కు ఓటు వేసినా ఆ ఓట్లన్నీ బీజేపీకే చెందుతాయని చెప్పారు;
రానున్న ఎన్నికల్లో ఏ ఇతర రాజకీయ పార్టీలతోనూ టీఎంసీ పొత్తులు పెట్టుకోబోదని ఆపార్టీ అధ్యక్షురాలు, పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ స్పష్టం చేశారు. ప్రజల మద్దతుతో ఒంటరిగానే బరిలోకి దిగుతామన్నారు. 2024 ఎన్నికల్లో కేవలం ప్రజలకు, తృణమూల్‌కు మధ్యనే పొత్తు ఉంటుందన్నారు. ఎవరైతే బీజేపీని ఓడించాలను కుంటారో వాళ్లంతా తృణమూల్‌కే ఓటు వేస్తారన్నారు. సీపీఎం, కాంగ్రెస్‌కు ఓటు వేసినా ఆ ఓట్లన్నీ బీజేపీకే చెందుతాయని చెప్పారు. తాజా ఎన్నికల ఫలితాల్లో ఇదే విషయం స్పష్టమైందని దీదీ వెల్లడించారు.