West Bengal : నందిగ్రామ్ లో ఉత్కంఠ... ఆధిక్యంలోకి దీదీ
పచ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో యావత్ దృష్టిని ఆకర్షిస్తున్న నందిగ్రామ్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు క్షణక్షణానికి ఉత్కంఠని రేకెత్తిస్తుంది.;
పచ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో యావత్ దృష్టిని ఆకర్షిస్తున్న నందిగ్రామ్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు క్షణక్షణానికి ఉత్కంఠని రేకెత్తిస్తుంది. తొలిరౌండ్లలో మమతా బెనర్జీ వెనకబడగా, ఏడో రౌండ్ వచ్చేసరికి ఆమె ఆధిక్యంలోకి వచ్చారు. ఏడు రౌండ్ల అనంతరం మమత.. తన సమీప బీజేపీ అభ్యర్ధి సువెందు అధికారి పైన 4 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అటు రాష్ట్రంలో తృణముల్ కాంగ్రెస్ సంపూర్ణ ఆధిక్యం దిశగా కొనసాగుతుంది. 292 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ప్రస్తుతం TMC 206స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. బీజేపీ కేవలం 83స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తుంది. ఇతరులు మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.