వీల్ ఛైర్ లోనే మమతా బెనర్జీ రోడ్ షో.. !
పశ్చిమ బెంగాల్‌ల్లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కాలిగాయం తర్వాత ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.;
పశ్చిమ బెంగాల్‌ల్లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కాలిగాయం తర్వాత ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆస్పత్రి నుంచి వీల్ ఛైర్ లోనే రోడ్ షో నిర్వహించారు. వేలాదిమంది కార్యకర్తలు వెంటరాగా.. వీల్ చైర్‌లోనే ప్రచారాన్ని కొనసాగించారు. రోడ్ షో అనంతరం హజ్రాలో జరిగే ఎన్నికలప్రచారంలో కూడా పాల్గొన్నారు. బీజేపీ కార్యకర్తల దాడిలో మమతా బెనర్జీ గాయపడ్డారని టీఎంసీ నేతలు అంటుండగా.. ఎన్నికల్లో సానుభూతికోసమే దాడి డ్రామా ఆడుతున్నారని బీజేపీ మండిపడుతోంది.