Kendriya Vidyalayas: కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ కోటాలో అడ్మిషన్లు నిలిపివేత..: కేంద్రం
Kendriya Vidyalayas: ప్రత్యేక నిబంధనల ప్రకారం, పది మంది పిల్లలను KVలో చేర్చుకోవాలని సిఫార్సు చేసే విచక్షణాధికారం పార్లమెంటు సభ్యులకు (MP) ఉంటుంది.;
Kendriya Vidyalayas:భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే కేంద్రీయ విద్యాలయ సంగతన్ (KVS), ప్రత్యేక నిబంధనల ప్రకారం అడ్మిషన్లను నిలిపివేసింది. ఇందులో ఎంపీ కోటా ద్వారా 10 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించే అర్హత ఉండేది ఇప్పటి వరకు. అయితే,
ఏప్రిల్ 12వ తేదీన అన్ని కేంద్రీయ విద్యాలయ పాఠశాలలకు ఒక లేఖ వచ్చింది. అందులో ఇలా ఉంది.."న్యూఢిల్లీలోని KVS ప్రధాన కార్యాలయం ఆదేశాల ప్రకారం, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ప్రత్యేక నిబంధనల ప్రకారం ఎలాంటి అడ్మిషన్లు చేయరాదు" అని ఆ లేఖలో పేర్కొన్నారు.
ప్రత్యేక నిబంధనల ప్రకారం, పది మంది పిల్లలను KVలో చేర్చుకోవాలని సిఫార్సు చేసే విచక్షణాధికారం పార్లమెంటు సభ్యులకు (MP) ఉంటుంది. ప్రస్తుతం, జనరల్ కేటగిరీ కింద అడ్మిషన్‌లు కొనసాగుతున్నాయి. ఎంపీ సిఫార్సులకు సంబంధించిన ప్రవేశాలు "ప్రస్తుతానికి హోల్డ్‌లో ఉంచబడ్డాయి." అని పేర్కొన్నారు.
అడ్మిషన్ల మార్గదర్శకాల ప్రకారం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, KVS ఉద్యోగుల పిల్లలు, ఎంపీల పిల్లలు, మనవళ్లకు ప్రవేశాన్ని అనుమతించే ప్రత్యేక నిబంధనల క్రింద వివిధ వర్గాలు ఉన్నాయి. "ఈ అడ్మిషన్లు సాధారణ అడ్మిషన్ల కంటే ఎక్కువగా జరుగుతాయి" అని ఆ అధికారి తెలిపారు.
రాజ్యసభ ఎంపీ, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సీనియర్ నాయకుడు సుశీల్ కుమార్ మోదీ పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తిన వారిలో ఒకరు. కేవీఎస్‌లోని 7,880 ఎంపీ కోటా సీట్లను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ చర్యను స్వాగతిస్తున్నాను.. అడ్మిషన్లలో పారదర్శకత ఉండాలి.. అవినీతికి ఆస్కారం ఉండకూడదు.. ఈ అడ్మిషన్లు మెరిట్ లేదా రిజర్వేషన్ ఆధారంగా జరగవు.. క్లారిటీ ఉండాలి.. ప్రభుత్వం వీటిని పెండింగ్‌లో పెట్టడం స్వాగతించదగిన చర్య అని మంత్రి జాతీయ మీడియాతో పంచుకున్నారు.