Nagaland : నాగాలాండ్‌ ఘటనపై దద్దరిల్లిన లోక్‌సభ

Nagaland : నాగాలాండ్‌ ఘటనపై లోక్‌సభ దద్దరిల్లింది. భద్రతా బలగాల చేతిలో 13 మంది పౌరులను బలితీసుకోవడంపై చర్చ జరగాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, విపక్ష సభ్యులు పట్టుబట్టారు.

Update: 2021-12-06 05:48 GMT

నాగాలాండ్‌ ఘటనపై లోక్‌సభ దద్దరిల్లింది. భద్రతా బలగాల చేతిలో 13 మంది పౌరులను బలితీసుకోవడంపై చర్చ జరగాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, విపక్ష సభ్యులు పట్టుబట్టారు. నాగాలాండ్‌ ఘటనపై హోంమంత్రి అమిత్‌ షా ప్రకటన చేస్తారని స్పీకర్ సమాధానం ఇచ్చారు. అయితే, విపక్షాలు మాత్రం చర్చకు సమయం కేటాయించాల్సిందేనంటూ డిమాండ్ చేశాయి. మరోవైపు, తెలంగాణలో సమగ్ర ధాన్యం కొనుగోళ్లపై ఎంపీ నామా నాగేశ్వరరావు వాయిదా తీర్మానం ఇచ్చారు. వాయిదా తీర్మానం తిరస్కరించడంతో టీఆర్‌ఎస్ ఎంపీలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. అటు రాజ్యసభను కూడా నాగాలాండ్ ఘటన కుదిపేసింది. పౌరులపై సైన్యం కాల్పులు జరిగన ఘటనపై చర్చకు పట్టుబడ్డారు విపక్ష పార్టీల ఎంపీలు. సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు.. సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.

Tags:    

Similar News