బిగ్‌బాస్ హౌస్‌లో క్యారెక్టర్ జడ్జిమెంట్లు..
అఖిల్ కూడా ఆమె ఎవరితో మాట్లాడినా, డ్యాన్స్ చేసినా, సరదాగా ఉన్నా సహించలేకపోతున్నాడు.;
ఎదుటి వ్యక్తిలో తప్పులు ఎంచడం ఎంత ఈజీ. అదే మనతప్పుల్ని ఎవరైనా తప్పుబడితే అంత తేలిగ్గా అంగీకరించం. అది చెప్పే విధానాన్ని బట్టి కూడా ఉంటుంది. నొప్పించకుండా తప్పులు చెబితే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారేమో. బిగ్‌బాస్ హౌస్‌లో అదే జరుగుతోంది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఇంటిసభ్యులు ఎవర్ని ఎందుకు ఎలిమినేట్ చేస్తున్నారో చెప్పాల్సి ఉంది. అరుపులు, ఆర్గ్యుమెంట్లు, ఏడుపులతో టాస్క్‌లో భాగంగా నామినేషన్ ప్రక్రియ కొనసాగింది. పదే పదే ఒకరినే టార్గెట్ చేస్తుంటే తనమీదే తనకే అనుమానం వస్తుంది.
ఆ విషయంలో ఎక్కువగా అఖిల్, మోనాల్ దొరికపోతున్నారు. అఖిల్‌తో మోనాల్ సాన్నిహిత్యంగా మెలగడమే ఆమెకు మైనస్ అవుతోంది. అఖిల్ కూడా ఆమె ఎవరితో మాట్లాడినా, డ్యాన్స్ చేసినా, సరదాగా ఉన్నా సహించలేకపోతున్నాడు. తన ప్రాపర్టీలాగా ఫీలయిపోతున్నాడు. ఎలిమినేట్ అయి వెళ్లిపోయిన కుటుంబసభ్యులు కూడా అదే విషయాన్ని నొక్కి చెప్పారు. ఇక్కడికి ఆడడానికి వచ్చాము. ఆట మీద ఫోకస్ చెయ్యమంటూ. అయినా ఆ ఇద్దరిలో మార్పేమీ కనిపించట్లేదు.
కానీ మోనాల్ నా క్యారెక్టర్ డిసైడ్ చేయడానికి మీరెవరంటూ కన్నీళ్ల పర్యంతం అవుతోంది. ఇది నేషనల్ మీడియా అందరూ చూస్తారు. నా వాళ్లు నన్ను బ్యాడ్‌గా ఊహించుకుంటారు అంటూ ఏడుస్తోంది. బయట టాక్ కూడా అలానే వెళుతోంది. ఇక అభిజిత్‌కి, అఖిల్‌కి పెద్ద వారే జరుగుతోంది. హారిక కూడా అదే బాటలో పయనిస్తూ అఖిల్‌పై విరుచుకుపడుతోంది. మొత్తానికి ఎక్కువ మంది ఇంటి సభ్యులు ఏకగ్రీవంగా అఖిల్‌ని ఎలిమినేట్ చేసే పనిలో ఉన్నట్టుగా అర్థమవుతోంది.