వంట నూనెలకు సుంకం మంటలు
కేంద్ర బడ్జెట్‌తో నూనె ధరలకు రెక్కలొచ్చాయి. సుంకం పెంచడంతో వంట నూనెలను కొనేందుకు డీలర్లు ముందుకు రాని పరిస్థితి. పామాయిల్ ధర ఒక్కరోజులోనే 4 రూపాయలు పెరిగింది.;
కేంద్ర బడ్జెట్‌తో నూనె ధరలకు రెక్కలొచ్చాయి. సుంకం పెంచడంతో వంట నూనెలను కొనేందుకు డీలర్లు ముందుకు రాని పరిస్థితి. పామాయిల్ ధర ఒక్కరోజులోనే 4 రూపాయలు పెరిగింది. ఇప్పటివరకు పామాయిల్‌పై కేంద్రం వసూలు చేస్తున్న సుంకం 27 శాతం ఉండగా... తాజాగా అది 35 శాతానికి చేరింది. ఇటు సన్ ఫ్లవర్, వేరుశెనగ నూనెల ధరలు కూడా పెరిగాయంటున్నారు నూనెల తయారీ సంస్థల ప్రతినిధులు. ముడిసరుకు దిగుమతి తక్కువగా ఉందని విజయ నూనెల తయారీ ప్రభుత్వ రంగ సంస్థ సిబ్బంది అంటున్నారు. ఆయిల్ ధరలు పెరిగాయి కాబట్టి... మార్కెట్‌లో కల్తీ నూనెలు కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.