Omicron India: దేశంలో అయిదుకు పెరిగిన ఒమిక్రాన్ బాధితుల సంఖ్య.. ఢిల్లీలో..
Omicron India: దేశంలో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య ఐదుకు పెరిగింది.;
Omicron India (tv5news.in)
Omicron India: దేశంలో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య ఐదుకు పెరిగింది. కొత్త కేసు ఢిల్లీలో నమోదైంది. టాంజానియా నుంచి ఢిల్లీకి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్‌గా నిర్ధారించారు. ప్రస్తుతం ఢిల్లీలోని LNJP హాస్పిటల్‌లో బాధితుడికి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటివరకూ విదేశాల నుంచి ఢిల్లీకి వచ్చిన 17 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు ఢిల్లీ హెల్త్ మినిస్టర్ సత్యేందర్ జైన్. వీరందరి శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపినట్లు చెప్పారు.
మొదటి రెండు ఒమిక్రాన్ కేసులు కర్ణాటక రాజధాని బెంగళూరులో గుర్తించారు. ఇక శనివారం మహారాష్ట్రలో ఒక కేసు, గుజరాత్‌లో మరో కేసును గుర్తించారు. ఒమిక్రాన్ వేరియంట్‌ను తొలిసారిగా నవంబర్ 25న సౌతాఫ్రికాలో గుర్తించారు. ఇప్పటివరకూ 23 దేశాలకు ఒమిక్రాన్ వేరియంట్ విస్తరించింది. ఒమిక్రాన్ ఆందోళనల నేపథ్యంలో సదరన్ ఆఫ్రికన్ దేశాల నుంచి వచ్చే విమానాలపై పలు దేశాలు ఆంక్షలు విధించాయి.