Modi Kedarnath : ఇవాళ కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించనున్న ప్రధాని మోదీ
Modi Kedarnath : కాసేపట్లో ప్రధాని మోదీ... ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్ నాథ్‌ను సందర్శించనున్నారు. కేదార్‌నాథ్ ఆలయంలో పూజలు నిర్వహిస్తారు.;
Modi Kedarnath :కాసేపట్లో ప్రధాని మోదీ... ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్ నాథ్‌ను సందర్శించనున్నారు. కేదార్‌నాథ్ ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. అనంతరం కొత్తగా నిర్మించిన ఆదిశంకరాచార్య సమాధిని దర్శించి.. విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అలాగే 250 కోట్ల రూపాయలతో చేపడుతున్న కేదార్‌పురి పునర్నిర్మాణ ప్రాజెక్టును.. ఆలయ ప్రాంగంణంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రధాని ప్రారంభిస్తారు. ఆలయ అభివృద్ధిపై అధికారులతోనూ సమీక్షించనున్నారు. 2013లో వచ్చిన భారీ వరదలకు ఆది శంకరాచార్య సమాధితో పాటు కేదార్‌నాథ్‌లో పలు కట్టడాలు ధ్వంసమవడంతో వాటిని పునర్నిర్మిస్తున్నారు.