Narendra Modi : గడిచిన ఏడేళ్లలో దేశం ఎంతో మారింది : ప్రధాని మోదీ
Narendra Modi : ప్రపంచంలో భారత్ లీడర్‌గా ఎదుగుతోందన్నారు ప్రధాని మోదీ.;
Narendra Modi : ప్రపంచంలో భారత్ లీడర్‌గా ఎదుగుతోందన్నారు ప్రధాని మోదీ. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై లోక్‌సభలో మాట్లాడిన మోదీ.. కొత్త సంకల్పంతో వందేళ్ల స్వాతంత్ర్యంలోకి అడుగుపెడదామన్నారు. గడిచిన ఏడేళ్లలో దేశం ఎంతో మారిందని.. పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని అన్నారు. ఆజాదీ అమృత్ మహోత్సవ్ మనకు ప్రేరణగా నిలవాలన్నారు. ఐతే.. మోదీ ప్రసంగాన్ని కొద్దిసేపు కాంగ్రెస్ సభాపక్ష నేత అధిర్ రంజన్ అడ్డుకున్నారు.. దీంతో కొందరు ఇంకా 2014లోనే ఉన్నారంటూ అధిర్ రంజన్‌కు మోదీ చురకలంటించారు. ప్రజలు ప్రమాదంలో ఉంటే కాంగ్రెస్ రాజకీయం చేస్తోందంటూ మండిపడ్డారు.