Tokyo Olympics: ఒలింపిక్ క్రీడాకారులతో ప్రధాని మాటామంతి
Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లబోతున్న భారత అథ్లెట్లలో ప్రధానిమోదీ వర్చువల్‌గా మాట్లాడారు.;
Modi
టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లబోతున్న భారత అథ్లెట్లలో ప్రధానిమోదీ వర్చువల్‌గా మాట్లాడారు. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుతోనూ, ఆమె తల్లిదండ్రులతోనూ మాట్లాడిన ప్రధాని.. సింధును ప్రపంచ చాంపియన్ గా ఎలా మలిచారంటూ ఆమె తల్లిదండ్రులను అడిగారు. ఇక హైదరాబాద్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో మాట్లాడి ఆమె కెరీర్ గురించి తెలుసుకున్నారు. వీరితో పాటు స్టార్ బాక్సర్ మేరీ కోమ్, రెజ్లింగ్ క్రీడాకారిణి వినేశ్ ఫోగాట్, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనికా బాత్రా, చాంపియన్ ఆర్చర్ దీపికా కుమారి, స్విమ్మింగ్ సంచలనం సజన్ ప్రకాశ్‌లతో మాట్లాడి.. వారిలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు.