PM Mudra Yojana: చిరు వ్యాపారులకు 'ముద్రా' లోన్ స్కీమ్.. రూ.10 లక్షల వరకు రుణం..

PM Mudra Yojana: లోన్ తీసుకోవాలనుకునే వ్యక్తులు ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.;

Update: 2021-12-31 02:30 GMT

PM Mudra Yojana: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముద్ర లోన్ పథకాన్ని 2015 సంవత్సరంలో ప్రారంభించారు. ఈ పథకం కింద దేశంలోని ప్రజలు స్వంతంగా చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించుకోవడానికి వీలవుతుంది. ఇందు కోసం ఈ స్కీమ్ కింద రూ. 10 లక్షల వరకు రుణం పొందుతారు.

ప్రధాన మంత్రి ముద్రా యోజన

ప్రధాన మంత్రి ముద్ర లోన్ స్కీమ్ కింద, లోన్ తీసుకోవాలనుకునే వ్యక్తులు లోన్ తీసుకోవడానికి ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పథకం కింద రుణ చెల్లింపు వ్యవధి 5​​సంవత్సరాలు పొడిగించబడింది.

ఈ పథకం కింద వాణిజ్య వాహనాల కొనుగోలుకు కూడా ప్రభుత్వం రుణాలు అందజేస్తుంది. ట్రాక్టర్లు, ఆటో రిక్షాలు, టాక్సీలు, ట్రాలీలు, సరుకు రవాణా వాహనాలు, త్రీ వీలర్లు, ఈ-రిక్షాలు మొదలైన వాటిని కొనుగోలు చేసేందుకు ఈ పథకం ద్వారా రుణాలు తీసుకోవచ్చు.

ప్రధానమంత్రి ముద్ర లోన్ యోజన ద్వారా వ్యవసాయం మరియు పశుసంవర్ధకానికి, వ్యాపారులకు, దుకాణదారులకు మరియు సేవా రంగానికి కూడా రుణాలు అందించబడతాయి. లబ్ధిదారులకు రుణం అందజేసేందుకు ముద్ర కార్డును అందజేస్తారు.

ప్రధాన మంత్రి ముద్ర లోన్ స్కీమ్ 2022 యొక్క ఉద్దేశ్యం

ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, దేశంలో చాలా మంది ప్రజలు స్వంతంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు. కానీ డబ్బు లేకపోవడం వల్ల తమ కలను సాకారం చేసుకోలేరు. ప్రధానమంత్రి ముద్ర లోన్ స్కీమ్ ద్వారా దేశ ప్రజల కలలను సాకారం చేయడం పథకం ముఖ్య ఉద్దేశ్యం.

ప్రధాన మంత్రి ముద్రా యోజన రకాలు

ఈ పథకం కింద మూడు రకాల రుణాలు ఇస్తారు.

శిశు లోన్: ఈ రకమైన ముద్రా యోజన కింద, లబ్ధిదారులకు ₹ 50000 వరకు రుణం కేటాయించబడుతుంది.

కిషోర్ లోన్: ఈ రకమైన ముద్రా పథకం కింద, లబ్ధిదారులకు ₹ 50000 నుండి ₹ 500000 వరకు రుణాలు కేటాయించబడతాయి.

తరుణ్ లోన్: ఈ రకమైన ముద్రా యోజన కింద, లబ్ధిదారులకు ₹ 500000 నుండి ₹ 1000000 వరకు రుణం కేటాయించబడుతుంది.

ముద్రా యోజన కింద ఉన్న బ్యాంకులు

బ్యాంక్ ఆఫ్ బరోడా

కెనరా బ్యాంక్

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

బ్యాంక్ ఆఫ్ ఇండియా

పంజాబ్ నేషనల్ బ్యాంక్

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ఇండియన్ బ్యాంక్

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర

ఐసీఐసీఐ

హెచ్‌బీఎఫ్‌సీ

యాక్సిస్

ఐడీబీఐ

ఎస్ బ్యాంక్

కోటక్ మహీంద్రా

ఇండస్ ఇండ్ బ్యాంక్

ఫెడరల్ బ్యాంక్

ఐడీఎఫ్‌సీ

జమ్ము అండ్ కశ్మీర్

ముద్ర రుణం తీసుకునే లబ్ధిదారునికి ముద్రా కార్డు అందజేస్తారు. ఈ ముద్రా కార్డును లబ్ధిదారుడు డెబిట్ కార్డుగా ఉపయోగించవచ్చు. ముద్రాకార్డు ద్వారా లబ్ధిదారుడు తన అవసరానికి అనుగుణంగా ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవచ్చు. ఈ ముద్రా కార్డ్‌తో మీకు పాస్‌వర్డ్ అందించబడుతుంది. దానిని మీరు ఎవరికీ తెలియపరచకూడదు. మీరు మీ వ్యాపార సంబంధిత అవసరాలను తీర్చుకోవడానికి మాత్రమే ఈ ముద్రా కార్డుని ఉపయోగించాలి. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్ https://www.mudra.org.in/ ని చూడవచ్చు. 

Tags:    

Similar News