Narendra Modi : నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాల ఏర్పాటుపై ప్రధాని మోదీ కీలక భేటీ
Narendra Modi : అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాల ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక భేటీ నిర్వహించారు.;
Narendra Modi : అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాల ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక భేటీ నిర్వహించారు. ఢిల్లీలోని ప్రధాని అధికార నివాసంలో హోంమంత్రి అమిత్‌షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, జాతీయ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోశ్, పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో ఆదివారం సమావేశమయ్యారు. ఉత్తర్‌ప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపుర్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
ఇక ఈ సమావేశంలో మణిపుర్ సీఎం ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. మాజీ సీఎం బీరేన్ సింగ్ వైపే పార్టీ మరోసారి మొగ్గుచూపింది. ఈ పోస్టుకు మరో ఇద్దరి పేర్లు పరిశీలనలోకి వచ్చినప్పటికీ బీరేన్‌నే ఖరారు చేసింది. దీంతో వరుసగా రెండోసారి ఆయన మణిపుర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
ఇక గోవా సీఎం ఎవరనేది దానిపై స్పష్టత రాలేదు. ఇప్పటివరకు సీఎంగా ఉన్న ప్రమోద్ సావంత్‌నే కొనసాగించాలా? లేక మరో వ్యక్తిని ఖరారు చేయాలా? అనే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించారు.
ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఓటమితో అక్కడ కొత్త వ్యక్తిని సీఎంగా ఎన్నుకునే పరిస్థితి ఎదురైంది. దేహ్రాదూన్‌లో ఇవాళ సమావేశం ఏర్పాటుచేసి సీఎం అభ్యర్థిని ఖరారు చేయనున్నారు.
యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ఈనెల 25న ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే కేబినెట్ మంత్రుల గురించి ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. మంత్రుల ఖరారుపై సుధీర్ఘంగా మంతనాలు జరుగుతుున్నాయి. ఈ విషయాలను సైతం ప్రధాని మీటింగ్‌లో చర్చించినట్లు తెలుస్తోంది.