కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసిన వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు
20 నిమిషాలు పాటు సాగిన భేటీలో అనేక అంశాలు చర్చించినట్లు తెలిపారు రఘురామకృష్ణరాజు.;
కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు భేటీ అయ్యారు. 20 నిమిషాలు పాటు సాగిన భేటీలో అనేక అంశాలు చర్చించినట్లు తెలిపారు. వై కేటగిరి భద్రత ఇచ్చినందుకు హోంమంత్రి అమిత్‌షాకు కృతజ్ఞతలు తెలిపారు. విభజన హామీలు, పోలవరం సహా అనేక అంశాలను షా దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.
రాష్ట్రంలో దేవాలయాలపై దాడుల కేసులను త్వరగా దర్యాప్తు చేయాలని కోరినట్లు తెలిపారు. ఏపీ పర్యటనకు రావాలని అమిత్‌షాను కోరగా, త్వరలో వస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు రఘురామకృష్ణరాజు.