Rajasthan: కొవ్వెక్కిన జంట కోసం జల్లెడ పడుతున్న పోలీసులు

నడుస్తున్న బైక్ పై సరసాలు; కెమెరా కంటికి చిక్కిన జంట; ఎవరంటూ ఆరాతీస్తున్న పోలీసులు; చిక్కితే బడిత పూజే మరి....

Update: 2023-03-08 10:07 GMT

హోళీ పర్వదినం పురస్కరించుకుని నలుగురితో కలసి సరదా ఆడిపాడి ఎంజాయ్ చేయాల్సిన జంట... కాస్త శ్రుతిమించింది. రంగులు పూసుకుని సందడి చేయడంతోనే సరిపెట్టేస్తే ఎలా అనుకుందో ఏమో.. బైక్ ఎక్కి షికార్లు కొట్టింది. పోనీ, అక్కడితో ఆగారా అంటే అదీ లేదు. బైక్ పైనే సరసాలు, సయ్యాటలు మొదలుపెట్టడంతోనే అసలు సమస్య వచ్చింది. ఈ ఘటన రాజస్థాన్ లోని పింక్ సిటీ జైపూర్ లో చోటుచేసుకుంది.  వీరి బైక్ విన్యాశాలు ఇతర వాహనదారులు రికార్డ్ చేయడంతో  ప్రస్తుతం ఈ జంట కోసం పోలీసులు జైపూర్ వీధులను జల్లెడ పడుతున్నారు. బీ2 బైపాస్ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుందని తెలుస్తోంది. బైక్ రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా ఈ జంటను పట్టుకునే ప్రయత్నం చేస్తోంది. 

Tags:    

Similar News