థర్డ్ వేవ్ ప్రభావం పిల్లలపై ఉంటుందని ఆధారాలు లేవు- గులేరియా

Guleria: కరోనా థర్డ్ వేవ్ ప్రభావం పిల్లలపై ఉంటుందన్నదానికి శాస్త్రీయ అధ్యయనం లేదన్నారు ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా

Update: 2021-08-14 12:54 GMT

Randeep Guleria: కరోనా థర్డ్ వేవ్ ప్రభావం పిల్లలపై ఉంటుందన్నదానికి శాస్త్రీయ అధ్యయనం లేదన్నారు ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా. చిన్నారులకు వ్యాక్సినేషన్ లేనందున..వారు ఎక్కువగా వైరస్ బారిన పడుతారనే అంచనా మాత్రం ఉందన్నారు. విశాఖలో గీతం యూనివర్సిటీ 41వ ఫౌండేషన్ డే అవార్డును అందుకున్నా రణదీప్ గులేరియా.. దేశంలో కోవిడ్ ప్రవర్తనా నియమావళిని పాటించడంపైనే మూడో వేవ్ ఆధారపడి ఉందన్నారు. ఇప్పుడు ఈశాన్య, దక్షిణ ప్రాంత రాష్ట్రాల్లోనే వైరస్ పెరుగుతుందన్నారు.

ఏపీలో కేసులు కట్టడి పర్వాలేదన్న ఆయన.. కేసులు పెరుగుతున్నప్రాంతంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటే ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా అడ్డుకట్టవేయగలమన్నారు.

Tags:    

Similar News