Ratan Tata : విమానయానానికి ఎయిరిండియాను మారుపేరుగా తీర్చిదిద్దుతాం : రతన్ టాటా
Ratan Tata : విమానయానానికి ఎయిరిండియాను మారుపేరుగా తీర్చిదిద్దుతామని టాటా సన్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా తెలిపారు.;
Ratan Tata : విమానయానానికి ఎయిరిండియాను మారుపేరుగా తీర్చిదిద్దుతామని టాటా సన్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా తెలిపారు. అందుకోసం అందరితో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కొన్ని ఎయిరిండియా విమానాలు బయలుదేరుతున్నప్పుడు రతన్ టాటా 19 సెకన్ల వీడియో మెసేజ్ ప్లే చేశారు. ఆ వీడియో క్లిప్పింగ్‌ను ఎయిరిండియా ట్వీట్ చేసింది. నష్టాల్లో చిక్కుకున్న ఎయిరిండియాను గత నెల 27న టాటా సన్స్ టేకోవర్ చేసుకుంది. గత కొన్ని రోజులుగా కొన్ని విమానాల్లో ఈ మెసేజ్ ప్లే చేస్తున్నట్లు ఎయిరిండియా తెలిపింది. ఎయిరిండియా నూతన ప్రయాణికులకు టాటా గ్రూప్ స్వాగతం పలుకుతున్నదని.. సౌకర్యవంతమైన ప్రయాణంతో పాటు మెరుగైన సేవలకు ఎయిరిండియాను మారుపేరుగా నిలుపుతామని రతన్ టాటా ఆ సందేశంలో పేర్కొన్నారు.